రిజల్ట్ మారినా… స్కోర్లు మారలేదు

242
- Advertisement -

క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన జరిగింది. ఇప్పటివరకు భారీ స్కోర్లు,తక్కువ బాల్స్‌లో సెంచరీ,డబుల్ సెంచరీ,వికెట్లు తీయడం,భారీ తేడాతో గెలుపొందడం వంటి ఫీట్లు మనం చూశాంటాం. కానీ తాజాగా జరిగిన ఫీట్ మళ్లీ జరిగే అవకాశం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

అఫ్గానిస్తాన్, జింబాబ్వే వన్డే సిరీస్‌లో జరిగిన అద్భుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జింబాబ్వేపై తొలి వన్డేలో రికార్డు విజయాన్ని సాధించన అఫ్ఘనిస్తార్ రెండో వన్డేలో మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. ఇందులో విశేషం ఏంటంటే..తొలివన్డేలో నమోదైన గణంకాలే…రెండో వన్డేలో నమోదుకావడం విశేషం.

Afghanistan vs Zimbabwe, 2nd ODI

తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ 5 వికెట్లకు 333 పరుగులు చేయగా, ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 34.4 ఓవర్లలో 179 పరుగులకే అలౌలైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అదే స్కోర్లు నమోదయ్యాయి. అయితే,ఈ సారి జింబావ్వే ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగి 5 వికెట్లు నష్టపోయి 333 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ సరిగ్గా 179 పరుగులకే కుప్పకూలింది. కేవలం ఆలౌటైన జట్టు ఆడిన ఓవర్లలోనే వ్యత్యాసం తప్ప.. ఇతర అన్ని అంశాలు ఒకేలా రిపీట్ కావడం క్రికెట్ చరిత్రలో ఇది తొలిసారి.

- Advertisement -