పాక్ దాడులను ఖండించిన క్రికెటర్లు

1
- Advertisement -

అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ సహా పలువురు ఆటగాళ్లు కాబూల్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో పౌరుల ప్రాణనష్టం భారీగా జరిగిందన్న వార్తల నేపథ్యంలో వారు సోషల్ మీడియాలో స్పందించారు.

కాబూల్ నగరంపై పాకిస్తాన్ భారీ బాంబుదాడులు జరిపినట్లు సమాచారం. నగరంలో పలు పేలుళ్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. తాలిబాన్ ప్రకారం, ఈ దాడిలో కనీసం 400 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఒక ఆసుపత్రి లక్ష్యంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్పందించిన రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “కాబూల్‌లో పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల పౌరులు మరణించడం ఎంతో బాధాకరం. ఇళ్లపై, విద్యాసంస్థలపై, ఆసుపత్రులపై దాడి చేయడం యుద్ధ నేరం. పవిత్ర రమజాన్ నెలలో ఇలాంటి చర్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మరియు మానవ హక్కుల సంస్థలు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఇతర అఫ్గాన్ క్రికెటర్ నబీ కూడా ఈ దాడులను ఖండించారు. “ఈ రాత్రి కాబూల్‌లో ఆసుపత్రి వద్ద ఆశలు ఆరిపోయాయి. చికిత్స కోసం వచ్చిన యువకులు బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు తమ పిల్లల కోసం ఎదురు చూసే దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి” అని మహ్మద్ నబీ ట్వీట్ చేశారు. కొన్ని వారాలుగా పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండగా, ఈ దాడులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.

Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

- Advertisement -