రణబీర్-ఐష్ యే దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాపకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నటులను బహిష్కరించాలని ఎంఎన్‌ఎస్‌తో పాటు కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్ భట్ నేతృత్వంలో నిర్మాతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సినిమా విడుదలకు అడ్డంకులు లేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్ నాథ్.. నిర్మాతల సంఘానికి హామీ ఇచ్చారు. ఎలాంటి విధ్వంసం జరగకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సినిమాకు రక్షణ కల్పిస్తామని హోంమంత్రి చెప్పినట్లు ముఖేష్ భట్ తెలిపారు. దీంతో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా అక్టోబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో పాక్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన కారణంగా సినిమాను అడ్డుకుంటామని, థియేటర్లపై దాడులు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. సినిమా ఓనర్స్ అసోసియేషన్ కూడా నాలుగు రాష్ట్రాల్లోని వందలాది థియేటర్లలో సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించడంతో దర్శక నిర్మాత కరణ్‌జోహర్ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. నాకు మన దేశం తప్ప ఏది ముఖ్యం కాదని, భవిష్యత్తులో మళ్లీ పాకిస్థాన్ నటుల జోలికి వెళ్లనని, ఈ సినిమా రిలీజ్‌ను మాత్రం అడ్డుకోవద్దని కరణ్ జోహార్ ప్రాధేయపడ్డారు.
ఎంఎన్ఎస్ కార్యకర్తలు అరేబియా సముద్రం ఉప్పునీళ్లు తాగిన గూండాలు కావచ్చు.. కానీ నేను అలహాబాదీ గూండాను. పవిత్ర త్రివేణి సంగమ నీళ్లు తాగానంటూ ట్వీట్ చేశారు. నిస్సహాయులైన నటులపైన ప్రతాపం చూపడం కాదు… దమ్ముంటే నాతో తలపడండి.. ఎవరు పెద్ద గూండానో తేలిపోతుందని ఖట్జూ ఎంఎన్‌ఎస్‌కు ట్విట్టర్‌లో సవాల్ చేశారు.
చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఫుల్ గ్లామర్ పాత్రలో ఐష్ నటించింది. ఐష్ అందాలను పిచ్చి పిచ్చిగా వాడేశాడు దర్శకుడు.ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్ ఘాటుగా రొమాన్స్ చేసింది. వీరిద్దరి రొమాన్స్ సీన్లు ఆన్ లైన్లో హల్ చల్ చేశాయి. మరో హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టే రేంజీలో రణబీర్-ఐష్ లవ్ సీన్లు కలకలం రేపాయి.ఎంత హాటుగా,ఘాటుగా ఉన్నాయంటే చివరకు వాటిని సెన్సార్ బోర్డు కత్తిరించి య/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.