KTR:రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి

58
- Advertisement -

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో రూ.16,650 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈనేపథ్యంలో సంస్థ పెట్టుండిపై కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఫార్మా, లైఫ్‌ సైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధికి సంకేమని చెప్పారు. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ పంకజ్‌ పట్వారీతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్‌కు వివరించారు.

- Advertisement -