మహేష్ వైఫ్ నమ్రత అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు వారి గారాల పట్టి సితార ఇద్దరూ ఉండే ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి వీడియోలు కూడా షేర్ చేస్తుంది. ఇక అవి లైకులతో షేర్‌లతో సోషల్ మీడియా దుమ్ము దులుపుతాయి. తాజాగా నమ్రత ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో మహేశ్‌బాబు, సితార ఆదమరచి నిద్రపోతున్నట్లు ఉన్నారు కదా. అయితే అది నిజం కాదంటున్నారు సూపర్‌స్టార్ సతీమణి నమ్రత. నిద్రపోతున్నారని నమ్మకండి, వాళ్లు నటిస్తున్నారంటూ ఫొటో సీక్రెట్ బయటపెట్టారు.
ఈ ఫొటోకు బోలెడన్ని కామెంట్లు వచ్చాయి.. ‘చూడచక్కగా ఉన్నారు, క్యూట్, స్వీట్ డ్రీమ్స్, మహేశ్ ఏం చేసినా క్యూట్‌గా ఉంటుంది..’ అని తెగ కామెంట్లు చేశారు. కొన్ని గంటల్లోనే దాదాపు 85 వేల మంది ఫొటోను లైక్ చేశారు. మహేశ్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.