KTR:పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యం

49
- Advertisement -

జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు హైదరాబాద్ మహానగరంలో వార్డుల పాలన పద్ధతి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకుంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ చ‌ర్య‌లు ప్రారంభించారు. స‌చివాల‌యంలో పుర‌పాల‌క శాఖపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు.

Also Read: త్వరలో నిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ..

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా పరిపాలన ఫలాలు అందాలి. వార్డు కార్యాల‌యంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారు. స‌ర్కిల్, జోన‌ల్ ఆఫీసుల‌కు వెళ్ల‌కుండా వార్డు కార్యాల‌యంలోనే సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. సిటిజ‌న్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాల‌యాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Also Read: కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

- Advertisement -