HIT 3 పై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్

106
- Advertisement -

అడివి శేష్ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘హిట్ 2 ‘. డిసెంబర్ 2న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా తర్వాత దర్శకుడు శైలేష్ కొలను దీనికి మరో సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మూడో కేస్ అంటూ ముగ్గురు హీరోలతో HIT 3 రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబందించి హింట్ వదిలారు. విజయ్ సేతుపతి, నాని లతో పాటు శేష్ కూడా పార్ట్ 3 లో ఉంటాడని న్యూస్ బయటికి వచ్చేసింది.

తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు శేష్. పార్ట్3 తను ఉంటానని ఆ అవకాశం ఇచ్చిన శైలేష్ కి థాంక్స్ అని చెప్పాడు. విజయ్ సేతుపతి ఉంటాడా? అనే ప్రశ్న వినిపించనట్టుగా శేష్ బిహేవ్ చేశాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని చెప్తే నాని దసరా షూటింగ్ నుండి వచ్చి చంపేస్తాడని నవ్వుతూ పేర్కొన్నాడు.

ప్రస్తుతానికి హిట్ 3 లో నాని – విజయ్ సేతుపతి – శేష్ కన్ఫర్మ్ అయినట్టే. కాకపోతే ఎనౌన్స్ మెంట్ రాలేదు అంతే. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని చెప్తూ ప్రకటించి పార్ట్ 3 పై హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి..

రాజమౌళి ముఖ్య అతిథిగా

ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే లేదు

లావుగా ఉంటే నేరం ఎక్కడంటే…

- Advertisement -