అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ‘‘మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేస్తునందుకు చాలా సంతోషిస్తున్నాను.
గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’ చిత్రీకరణ మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతుంది’’ అంటూ చిత్ర నిర్మాత శరత్‌తో (చిట్కుల్‌లో జరిగిన మేజర్ సినిమా వర్కింగ్ స్టిల్) ఫోటోను షేర్ చేశారు అడివి శేష్.
నవంబరు 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకుడు. ఇటీవల విడుదలైన ప్యాన్‌ఇండియన్ మూవీ ‘మేజర్’ టీజర్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రికార్డు వ్యూస్ వస్తున్నాయి. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. అలాగే బిజినెస్ సర్కిల్స్‌లో ‘మేజర్’ సినిమా ఓ హాట్‌కేక్. ఈ సినిమా థియేట్రికల్ , ఇతర హాక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ‘మేజర్’ సినిమా ఓవర్‌సీస్ హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడైపోయిన విషయం తెలిసిందే..
మహేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్ ఎస్ మూవీస్ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్ సంస్థ ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రధాన తారాగణం: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్‌రాజ్, రేవతి మురళి శర్మ నటిస్తున్నారు.