మేజర్ రిలీజ్ డేట్ ఖరారు…

291
major
- Advertisement -

క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్. ప్రస్తుతం శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో మేజర్ మూవీ చేస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. జూలై 2న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందని వెల్లడించారు నిర్మాతలు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తోంది.

- Advertisement -