అడివిశేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్..

164
Adivi Sesh Major
- Advertisement -

క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిస్వార్థప‌రుడు, ధైర్యవంతుడు మరియు మ‌నంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన‌ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివిశేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు మేజర్ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌.

27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే.. మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయాల్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70% షూట్ పూర్తి చేసింది.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ మూవీకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

- Advertisement -