అడివి శేష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు అడవి శేష్. దేశమంతా పర్యటిస్తున్నానని మంచి స్పందన వస్తుందని తెలిపారు. 26/11 సంఘటనలు జరిగాక ఆయన ఫొటోలు బయటకు వచ్చాక మా కజిన్ నాకూ సందీప్‌కు పోలికలు ఉన్నాయని తెలిపాడని.. ఆయన నిజజీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ తెలియవు… 31 సంవత్సరాలలో ఆయన జీవితం ఎలా ఉందనేది ఎవరికీ తెలీదు. ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఆయన లైఫ్ గురించి ఎందుకు చెప్పకూడదనే ఆలోచన వచ్చింది…ఆ సినిమానే మేజర్ అన్నారు.
ఇండియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్‌కూడా వున్నాడు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి .ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులోని వున్న మొత్తం డబ్బులు ఇచ్చేశాడు. ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలట్రీ మనిషి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ వుంటుంది. కానీ ఇలాంటి సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని పెట్టలేదన్నారు.
సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ ఇద్దరు హీరోయిన్లు వున్నారు. తెలుగులో పాటలు వుంటేనే హీరోయిన్ ఉంటారనే టాక్ వుంది. కానీ సందీప్ లైఫ్‌లో ఒకరు ప్రజెంట్, ఒకరు ఫాస్ట్‌లో వున్నారు. ఆయనంటే చాలామంది లేడీస్‌కు క్రష్ ఉండేది. ఆయన చిన్నతనం నుంచి స్కూల్, ఉద్యోగం, పెండ్లి అనేది ఒక భాగమైతే, కాశ్మీర్, కార్గిల్ అనేది మరో భాగం.లాస్ట్ సీన్ చిట్‌కూర్ అనే ఊరిలో తీశాం. అక్కడ జనాలు 200మంది వుంటారు. పగలు మైనస్ 3 డిగ్రీలు వుంటుంది. రాత్రి మైనస్ 15వరకు వుంటుందని తెలిపారు. నాకు మేజర్ సందీప్ పాత్ర సన్‌షైన్ లాంటిదన్నారు.