వారిద్దరి పెళ్లి తర్వాతే పెళ్లిచేసుకుంటా!

106
adivi sesh
- Advertisement -

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.

ఇక దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు హీరో అడివి శేష్. ఈ నేపథ్యంలో పెళ్లి ప్రమోషన్‌లో భాగంగా అడివి శేష్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయనను ప్రశ్నించారు.

దీంతో ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు అడవి శేష్. ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంచా చాలా మంది ఉన్నారు….. తన స్నేహితులు ప్రభాస్, అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదని… వాళ్లిద్దరి పెళ్లి అయిపోయిన తర్వాత తాను చేసుకుంటానని చెప్పారు.

- Advertisement -