కోరిక తీర్చమన్నారు..క్యాస్టింగ్ కౌచ్‌పై అదితి..!

283
Aditi Rao Hydari on casting couch
- Advertisement -

సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న భూతం క్యాస్టింగ్ కౌచ్‌. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఈ అంశంపై నోరు విప్ప‌గా తాజాగా మ‌రో హీరోయిన్ స్పందించింది.తనకు క్యాస్టింగ్ కౌచ్‌ బాధితురాలేనని బాలీవుడ్ నటి అదితీ రావు హైదరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించిన అదితి …ఇండస్ట్రికి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తన కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని అధిగమించానని తెలిపింది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకున్నానని…. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వాటికి లొంగక పోవడంతో తనకు ఆఫర్లు లేదన్నారు.

సినీ పరిశ్రమలో పవర్ ప్లే నడుస్తుంటుందని, దాని వలలో అమ్మాయిలు పడకూడదని హెచ్చరించింది. సత్తా ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని స్పష్టం చేసింది. 2006లో మలయాళం సినిమాతో ఇండస్ట్రికి ఎంటరైన అదితి…2011లో యె సాలీ జిందగీ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

- Advertisement -