సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కుతోన్న’సమ్మోహనం’ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అదితీరావు హైదరి సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటున్నారు .
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..ఇంద్రగంటి ఎప్పుడూ తెలుగుదనానికి ప్రాముఖ్యతనిస్తారు. దాదాపుగా తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. ఆయన ప్రతి సినిమాలోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. `సమ్మోహనం` నాయిక అదితిరావు హైదరి తెలుగు మూలాలున్న అమ్మాయి. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెబుతోంది . చాలా బాగా డబ్బింగ్ చెబుతోంది . ఆ అమ్మాయి గొంతు కూడా చాలా బావుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. జూన్ 15న సినిమాను విడుదల చేస్తాం“ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ “కొత్త ఎత్తుగడ , కొత్త పోకడ ఉన్న నవతరం కథ `సమ్మోహనం`. రొమాన్స్ ,హాస్యం సమ్మిళితమై ఉంటాయి. పి.జి.విందా ఫొటోగ్రఫీ , వివేక్ సాగర్ సంగీతం , రవీందర్ కళా దర్శకత్వం మెప్పిస్తాయి. మంచి కథ, కథనానికి చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ చేశాం“ అని చెప్పారు.
నటీనటులు: సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, డా .వీకే నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్, శిశిర్‌శర్మ తదితరులు..సాంకేతిక నిపుణులు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, పాటలు: `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.