సారీ చెప్పిన ఆదిపురుష్ రైటర్ మనోజ్

41
- Advertisement -

ఎట్టకేలకు ఆదిపురుష్ వివాదంపై దిగొచ్చారు రైటర్ మనోజ్ ముంతాషిర్. ఆదిపురుష్ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. హద్దుమీరిన సృజనాత్మక స్వేచ్ఛతో రామాయణ గాథను వక్రీకరించారని, సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు పూర్తిగా కొరవడ్డాయని, గ్రాఫిక్స్‌తో మాయ చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన మనోజ్…చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, మన గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించుగాక అని పేర్కొన్నారు.

Also Read:నయనతార పై కేసు నమోదు!

ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకత్వం వహించారు.

Also Read:Modi:ఆర్ధిక శక్తిగా తెలంగాణ

- Advertisement -