Adipurush:వినూత్న ప్రయోగం

48
- Advertisement -

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇక ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.

తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్, థియేటర్స్ గురించి అధికారికంగా ఓ లెటర్ ని షేర్ చేశారు.

Also Read:నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..

రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని వెల్లడించింది. ఆదిపురుష్ టీం చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు సత్ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి..

- Advertisement -