ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా తొలిరోజు దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే తొలిరోజు నెగటివ్ టాక్ రాగా సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.
రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.77 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాం – రూ. 21.46 కోట్లు,సీడెడ్ – రూ. 5.26 కోట్లు,ఉత్తరాంధ్ర – రూ. 5.82 కోట్లు,ఈస్ట్ – రూ. 3.72 కోట్లు,వెస్ట్ – రూ. 2.82 కోట్లు,గుంటూరు – రూ. 4.85 కోట్లు,కృష్ణా – రూ. 2.65 కోట్లు,నెల్లూరు – రూ. 1.30 కోట్లు కలిపి రూ. 47.88 కోట్లు షేర్ కలెక్షన్స్ రాగా గ్రాస్ వసూళ్ల ప్రకారం చూస్తే రూ.74.75 కోట్లు వచ్చాయి.
Also Read:ఫాదర్స్ డే..తండ్రి పాత్రల్లో మెప్పించిన నటులు
కర్ణాటకలో రూ. 7.60 కోట్లు, తమిళనాడులో రూ. 1.05 కోట్లు, కేరళ రూ. 42 లక్షలు, హిందీ మరియు రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 35.30 కోట్లు, ఓవర్‌సీస్‌లో రూ. 16.25 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 108.50 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయని (గ్రాస్ ప్రకారం రూ. 214 కోట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:Sudheer17:మానాన్న సూపర్ హీరో