ఆదిపురుష్.. అదిరిపోయాడు

87
adipurush
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా బాలీవుడ్ దర్శకడు ఓం రావుత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండా భారీ అంచనాలు నెలకొన్నాయి. కృతి సనన్ , సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు.

ప్రపంచవ్యా‌ప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కానుండగా ఎట్టకేలకు రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రాముడిగా ప్రభాస్ బాగా సెట్ కాగా ఆయన చేతిలో బాణం ఉంది. అంతేకాకుండా.. ఆయన ఆ బాణాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉండగా.. మెరుపులు వస్తున్నాయి. ఆ పోస్ట్‌కి.. యూపీలోని అయోధ్యలో ప్రవహిస్తున్న సరయు నది ఒడ్డున మా అద్భుత యాత్రను ప్రారంభించనున్నాం. మా చిత్రం మొదటి పోస్టర్, టీజర్‌ను అక్టోబర్ 2న రాత్రి 7:11 గంటలకు మాతో కలిసి ఆవిష్కరించండి అని తెలిపారు.

- Advertisement -