ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్ర పోషించగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది .ఈ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకులను మెప్పించాడా లేదా చూద్దాం..
కథ:
రామాయణ కథ అందరికి సుపరిచితమే. ఇదే కథను వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు ఓం రౌత్. తండ్రి మాటకు కట్టుబడి భార్య జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీసింగ్)లతో కలిసి వనవాసం చేస్తాడు రాఘవుడు(ప్రభాస్).జానకిని లంకేష్ (సైఫ్ అలీఖాన్ )అపహరిస్తాడు. వానరసైన్యం సహాయంతో లంకేష్‌పై యుద్ధానికి సిద్ధమవుతాడు రాఘవుడు. ఈ యుద్ధంలో రాఘవుడు ఎలా గెలిచాడు అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఎమోషన్. రామయణ గాథ ఆధారంగా అనేక సినిమాలొచ్చాయి. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో రాముడిగాథను సిల్వర్‌స్క్రీన్‌పై ఆవిష్కరించగా మోడ్రన్ టెక్నాలజీతో ఆదిపురుష్ ను తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్ నటన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. జానకిగా కృతిసనన్ యాక్టింగ్‌కు వంక పెట్టలేం. ప్రభాస్, కృతిసనన్ మధ్య సీన్స్ విజువల్‌గా బాగున్నాయి. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువకావడంతో ఆదిపురుష్ పూర్తిగా అర్టిఫిషియల్ ఫీల్‌ను కలిగించింది.ఇక ప్రభాస్ క్యారెక్టర్ నిడివి తక్కువ కావడంతో ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. మూడు గంటల మూవీలో మహా అయితే గంటలోపే ప్రభాస్ కనిపిస్తాడు. గ్రాఫిక్స్‌తోనే ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయాలనే తపనతో కథ, క్యారెక్టరైజేషన్స్ విషయంలో పెట్టి ఉంటే ఆదిపురుష్ ఫలితం మరోలా ఉండేది.
Also Read:ఇలా చేస్తే ఎంతటి పొట్ట అయిన మటుమాయం.. !
సాంకేతికంగా విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. అజయ్ అతుల్ అందించిన పాటలు బాగున్నాయి. దర్శకుడు కథకు తెలుగు నేటివిటి జోడిస్తే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
రామాయణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఈసారి ఓం రౌత్ చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదనే చెప్పాలి. విజువల్ వండర్‌గా తెరకెక్కిద్దామని అనుకున్న అది సత్ఫలితాన్నివ్వలేదు. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ముందే తెలియడం, కథనం స్లోగా ఉండటం కొంత బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన పాత సినిమాల్ని చూడని ఆడియెన్స్ కు మాత్రం పర్వాలేదనిపిస్తుంది.
Also Read:తీరం దాటిన బిపర్‌జాయ్..
విడుదల తేదీ:16/06/2023
రేటింగ్:2.5/5
నటీనటులు:ప్రభాస్, కృతి సనన్,సైఫ్ అలీఖాన్
సంగీతం:సాచేత్ తాండన్- పరంపరా ఠాకూర్
నిర్మాత:టీ సిరీస్ బ్యానర్
దర్శకత్వం: ఓం రౌత్