ఆదిపురుష్‌…తప్పు చేశా!

17
- Advertisement -

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన తాజా పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. భారీ అంచనాలతో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడింది. కనీస వసూళ్లను రాబట్టలేక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది ఆదిపురుష్. ఇక ఓటీటీలోనూ ఆశీంచిన రెస్పాన్స్ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదిపురుష్‌ లో విలన్‌గా నటించాను… ఈ సినిమా చూసిన నా కుమారుడు ఈసారి ఇలాంటి సినిమాలో నన్ను హీరోగా చేయమని కోరాడు అని తెలిపాడు.

అంతేకాదు ఆది పురుష్ లో విలన్‌గా నటించినందుకు నేను నా కొడుక్కి సారీ చెప్పాను…నేను నటించిన అన్ని సినిమాలను ఎలా గౌరవిస్తానో ఆది పురుష్‌ ను కూడా అలానే చూస్తాను అని చెప్పారు. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

Also Read;మంత్రి పొన్నంతో ఆర్టీసీ సంఘాల భేటీ

- Advertisement -