అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

13
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.ఎన్డీయే కూట‌మికి 400కిపైగా స్ధానాలు వ‌స్తాయ‌ని, త‌మ‌కు సాధార‌ణ మెజారిటీ కోసం ప్లాన్ బీ అవ‌స‌రం లేద‌ని చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు అధిర్ రంజన్.

ఈసారి 400కిపైగా స్ధానాలు కాషాయ కూట‌మి క‌ల అని, మోడీ ఓట‌మి వాస్త‌వ‌మ‌ని తేల్చిచెప్పారు. జూన్ 4న జ‌రిగేది ఇదేన‌ని తెలిపారు.

ఇక అమిత్ షా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన షా.. 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోడీకి అండగా ఉన్నారని వారితోనే 400 సీట్లు వస్తాయన్నారు. ప్లాన్ ఏ విజయవంతమవుతుంది..అలాంటప్పుడు ప్లాన్ బీ అవసరం లేదన్నారు షా.

Also Read:హిట్ లిస్ట్.. టీజర్ లాంచ్

- Advertisement -