పీఎం కేర్స్‌ ఫండ్‌తో వెంటిలేటర్ల తయారీ..

155
pmcares
- Advertisement -

కరోనాతో పోరాడటానికి పీఎం కేర్స్ ఫండ్ కింద 50,000 వెంటిలేటర్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మేడ్ ఇన్ ఇండియా భాగంగాలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వెంటిలేటర్లను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇందులో 30, 000 వెంటిలేటర్ల తయారీ చేపట్టింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.మిగిలిన 20, 000 వెంటిలేటర్లలో ఆగ్వా హెల్త్‌కేర్ (10, 000), ఎఎమ్‌టిజెడ్ బేసిక్ (5650), ఎఎమ్‌టిజెడ్ హై ఎండ్ (4000), అలైడ్ మెడికల్ (350) కంపెనీల ఆధ్వర్యంలో తయారీ కానున్నాయి.

ఇప్పటివరకు 2, 923 వెంటిలేటర్లు ఉత్పత్తి కాగా 1, 340 వెంటిలేటర్లు ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేశారు. మహారాష్ట్ర (275), ఢిల్లీ (275), గుజరాత్ (175), బీహార్ (100), కర్ణాటక (90), రాజస్థాన్ (75)లతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు వెంటిలేటర్ల పంపిణీ చేయనున్నారు. జూన్ చివరి నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 14,000 వెంటిలేటర్లు పంపిణీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

- Advertisement -