- Advertisement -
రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరికి ట్రాన్స్‌ఫర్ చేసింది. మేడ్చల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న కే విద్యాసాగర్‌ను బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్‌ను మెదక్, మోహన్ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది.
కుమురం భీం అదనపు కలెక్టర్ రాంబాబు నిర్మల్‌కు బదిలీచేయగా….జగిత్యాల అదనపు కలెక్టర్ రాజేశం కుమురం భీంకు బదిలీ చేశారు. మహబూబాబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును హైదరాబాద్‌కు బదిలీ చేయగా గద్వాల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేశారు.
- Advertisement -