గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన శ్యాంప్రసాద్‌

123
- Advertisement -

టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. దేశంలోని ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అని పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్‌ జన్మదినము పురస్కరించుకొని అధికార నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాలుగా జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటుతున్నానని తెలిపారు. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఎంపీ సంతోష్‌ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదండి..

బాలల దినోత్సవం…గ్రీన్ ఛాలెంజ్

ఆస్పత్రిలో చేరిన నటుడు కృష్ణ..

తిరుమలలో అన్యమత ప్రచారం

- Advertisement -