- Advertisement -
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా మహాంకాళి ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆలయం నుండి బయటకు వచ్చిన అమిత్ షాకు చెప్పులు అందించారు బండి సంజయ్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బండి సంజయ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. బీజేపీ బానిస రాజకీయాలకు తెర లేపిందని మండిపడ్డారు దయాకర్. బండి సంజయ్….అమిత్ షా చెప్పులు మోసి… తెలంగాణ సమాజాన్ని కించ పరిచారన్నారు.
మునుగోడు ఆత్మగౌరవం చెబుతున్న బీజేపీ … తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని విమర్శించారు. భారత రాజ్యాంగం సమానాత్వన్ని ప్రొత్సహిస్తుంటే… బీజేపీ బానిసత్వాన్ని ప్రొత్సహిస్తోందన్నారు.
- Advertisement -