అడవుల సంరక్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఐ.ఎస్.ఎఫ్.ఆర్. నివేదిక ప్రకారం 2015-2021 కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 7.7 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని, 2019-2021 కాలంలో 3.07 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఎస్డీజీ 4వ ర్యాంక్‌లో మెరుగు పడిందని అలాగే ఐఎస్ఎఫ్ ఆర్ నివేదిక ప్రకారం తెలగాణ అటవీ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగిందని, అటవీ ప్రాంతంలో గిరిజనులకు మహిళలకు ఉపాధి అవకాశాలు మరింత పెరిగాయని వినోద్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ విడుదల చేసే కాంపా నిధులను కరోనా కాలంలోనూ ( 2019-20, 2020-21, 2021-22 ) పెద్ద ఎత్తున వినియోగించుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని, గ్రీనరీ పెరిగిందని, వన్యప్రాణుల సంరక్షణ బాగుందని, కాంపా నిధుల వినియోగం బాగుందని పార్లమెంటులో కేంద్ర మంత్రులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలుసుకోవాలి అని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని…మీరు చేసిన ప్రకటన సరి చూసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.
ఇవి కూడా చదవండి…