KTR:అదానీకి విశాఖ ఉక్కు…తెలుగు ప్రజలకు భారీ నష్టం..!

38
- Advertisement -

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి సంస్థను అమ్మి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విషయం పరిజ్ఞానం లేని వ్యక్తికి చెబితే ఓ బాధా..చెప్పకుంటే ఓ బాధ అని మంత్రి ఎద్దేవా చేశారు. మీరు విశాఖ ఉక్కు విషయంలో ఉన్న శ్రద్ధ బయ్యారం ఉక్కు మీద లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడినట్లుగా ఈ రోజు పేపర్లో చూశా. ఆయనకేమో విషయం పరిజ్ఞానం లేదు. విషయం లేదు. ఆయనకు చెబితే ఒక బాధ..చెప్పకపోతే ఒక బాధ. ఆయన విచిత్రమైన మనిషి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో..ఎలా మాట్లాడతాడో..ఎందుకు మాట్లాడుతాడో ఆర్థం కాదన్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ వివరించారు.

విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్‌ ఓర్‌. బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్‌ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉన్న గని బైలదిల్లా. భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్‌ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైలదిల్లాలో నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చిచెప్పాయి. అని తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారు. అదేవిధంగా కడపలో కూడా స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

అప్పటి స్టీల్ మినిస్టర్‌గా ఉన్న వీరేంద్ర చౌదరి కలిసి అడిగిన సంగతిని చెప్పారు. ఎన్‌ఎండీసీ 50వ వార్షికోత్సవానికి వస్తే హైదరాబాద్‌లోనే అడిగాం. దీనిపై జూన్‌ 2018లో స్వయంగా ప్రధాని మోదీని కలిసి బయ్యారం గురించి మాట్లాడిన సంగంతి గుర్తుచేశారు. బయ్యారంలో ఉక్కు గ్రేడ్ ఫెర్రస్ నాణ్యత 64శాతం ఉందని కావున సాధ్యం కాదని మీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కులంకుషంగా వివిరించామని అన్నారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పిడితే తెలంగాణ ఆర్థిక ముందుకు వెళ్లుతుందని అన్నారు. అంతేకాకుండా 15-20వేల మంది ఉద్యోగులు సృష్టిస్తామని అన్నారు. 2018 సెప్టెంబర్‌లో బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో అదానీ ఒక కంపెనీని తెరిచారని అన్నారు. అదానీ కోసం విశాఖ ఉక్కును పణంగా పెడుతున్నారని అన్నారు.

బైలదిల్లా నుంచి బయ్యారానికి ఐరన్‌ ఓర్‌ ఇస్తే అదానీకి నష్టం. అటు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సప్లై చేస్తే.. ముంద్రాలో అదానీ పాష్కో పెట్టాలని సంకల్పించిన ఫ్లాంట్‌కు నష్టం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలను చావుదెబ్బ తీస్తారని అన్నారు. బయ్యారం నుంచి బైలదిల్లా 150-160కిలోమీటర్లు. బైలదిల్లా నుంచి వైజాగ్‌ 600 కిలోమీటర్లు. అదే ముంద్రాకు 1800 కిలోమీటర్లు. ఇక్కడ ఫీజబుల్‌ కాదు.. కానీ తవ్వి 1800 కిలోమీటర్లు తీసుకెళ్తే ఫీజబుల్‌ ఎట్లయితదని ప్రశ్నించారు. ఇంతగొప్పగా రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి…

BRS:ప్రతీ గ్రామంలో జెండా ఎగరాలి

KCR:వికాసమే వివక్షకు విరుగుడు

Harishrao:యాసంగిలో ప్రతి గింజను కొనాలి

- Advertisement -