అదానీ తీరుపై మోదీ మౌనం వీడాలి:కవిత

48
- Advertisement -

హిండెన్ బర్గ్‌ నివేదికతో అదానీ ఆస్తులు కరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో తీవ్ర దూమారం చెలరేగింది. తాజాగా ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత భీమా సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం మంచిది కాదని మండిపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11శాతం మేర పడిపోవడం పట్ల కవిత స్పందిస్తూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు.

పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడి, రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని నిలదీశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. కేంద్రం జేపీసీపై స్పందించి ఉంటే ప్రజలు ఇంత మొత్తంలో నష్టపోయేవారు కాదని అన్నారు. ఇకనైనా కేంద్రం కళ్లు తెరిచి మరింత నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కవిత ట్వీట్టర్‌ ద్వారా మండిపడ్డారు. వెంటనే జేపీసీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి…

వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా హైదరాబాద్‌ ఫార్మాసిటీ..

ఆస్తమా ఉందా.. అయితే వీటితో జాగ్రత్త!

” బకాసనం ” వేస్తే ఎమౌతుందో తెలుసా?

- Advertisement -