అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బిల్‌గేట్స్‌ను దాటి గ్లోబల్ రిచ్‌లిస్ట్‌లో నాల్గో ప్లేస్‌కు చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం, గౌతమ్ అదానీ & ఆయన కుటుంబం సంపద శుక్రవారం నాటికి 112.9 బిలియన్ డాలర్ల (రూ. 9 లక్షల కోట్ల) కు పెరిగింది. టాప్‌లో టెస్లా బాస్ ఎలన్ మస్క్ కొనసాగుతుండగా, రెండో ప్లేస్‌లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (లూయిస్ విట్టన్), మూడో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 87.3 బిలియన్ డాలర్ల సంపదతో 10 వ ప్లేస్‌లో ఉన్నారు.
ప్రస్తుతం వివిధ ఎయిర్‌పోర్టులలో 500 ఎకరాల ల్యాండ్ అదానీ ఎయిర్‌పోర్టులలో అందుబాటులో ఉందని అంచనా. అదానీ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ డెవలప్ చేసే ఎరో సిటీలలో హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. అంతేకాకుండా లాజిస్టిక్స్, కమర్షియల్ ఆఫీసులు, ఇతర రియల్‌ఎస్టేట్ సెగ్మెంట్లలోని ప్రాజెక్ట్‌లను కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు.