కోహ్లీకి రోహిత్ సపోర్టు!

82
rohith
- Advertisement -

పేలవఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి సపోర్టుగా నిలిచాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విరాట్ ఫామ్‌పై చర్చ అనవసరమని.. కోహ్లీ మళ్లీ గాడిలో పడటానికి ఒకటి లేదా రెండు మంచి ఇన్నింగ్స్‌లు చాలని స్పష్టం చేశాడు.

కోహ్లీకి ఎవరి భరోసా అవసరం లేదు. భారత్ జట్టుని ఎన్నో మ్యాచ్‌ల్లో అతను గెలిపించాడు. గత కొన్నేళ్లుగా ఎన్నో పరుగుల్ని అతను చేశాడు. క్రికెట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకి కూడా తెలుసు అన్నారు.

గత కొంతకాలంగా పేలవఫామ్‌తో మాజీల నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు విరాట్. ఈ విమర్శలకు తగ్గట్టుగా కీలకమైన రెండో వన్డేలో నిరాశపర్చి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే విరాట్‌కు అండగా నిలిచాడు రోహిత్.

- Advertisement -