కికీ ఛాలెంజ్‌పై ఆదా శర్మ స్పందన..

239
aadha sharma
- Advertisement -

కికీ ఛాలెంజ్‌ వెర్రిపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. రన్నింగ్‌ కారులో నుంచి దిగి డ్యాన్స్ చేయడం,కొంతమంది ప్రమదాల బారిన పడుతుండటంతో పోలీసులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. కికీ ఛాలెంజ్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇక కికీ చాలెంజ్ చేసిన నటి ఆదా శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదా తాను రన్నింగ్ కారు నుంచి దిగి డ్యాన్స్ చేయలేదన్నారు. తానేమీ తప్పు చేయలేదని తిరిగి కారెక్కలేదని తెలిపింది. ఆ సమయంలో షూటింగ్ లో ఉన్నానని, కాస్తంత గ్యాప్ రావడంతో అప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ తోనే డాన్స్ వేశానే చెప్పుకొచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించే ఉంటారని తెలిపింది.

ఇదిఇలా ఉండగా ఆదా శర్మ.. తెల్లటి దుస్తులతో భరతనాట్యం, కథక్ రెండు కలిపి డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు వీడియో పోస్టు చేసిన 24 గంటలలోనే 7 లక్షల మందికిపైగా వీక్షించారు.

- Advertisement -