హార్ట్ బీట్‌ పెంచేస్తున్న అదా..!

240
aadha sharma
- Advertisement -

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్,హార్ట్ ఎటాక్ వంటి చిత్రాలతో మంచిగుర్తింపు తెచ్చుకున్న నటి అదా శర్మ. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఏదో ఒక యాక్టివిటీతో సోషల్‌ మీడియా అట్రాక్షన్‌ కొట్టేస్తోంది.

తాజాగా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరైన అదా తన అందచందాలను ప్రదర్శించింది. వెరైటీ డ్రెస్‌లో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. న్యూస్ పేప‌ర్ త‌ర‌హాలో డ్రెస్ ఉండగా అదా స్టిల్స్‌ని చూసి నెటిజన్లు ఫిల్‌ అవుతున్నారు.

ప్ర‌ముఖ డిజైన‌ర్‌ ఫయాజ్ జరీవాలా డిజైన్ చేసిన ఈ డ్రస్‌లో అదా అదరగొట్టింది. న్యూస్ పేపర్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన ఆదాశ‌ర్మ‌ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గతంలో కీకీ ఛాలెంజ్‌తో అదరగొట్టింది అదా. తాజాగా పేపర్ డ్రెస్‌తో మతిపొగొట్టింది.

ప్రస్తుతం తెలుగులో అ మూవీ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ల్కిలో న‌టిస్తుంది. దీంతో పాటు కమాండో ప్రాంఛైజీలో తెరకెక్కుతున్న థర్డ్ పార్ట్ కమాండో 3లో హీరోయిన్‌గా నటిస్తోండగా త్వరలో కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతోంది.

- Advertisement -