లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్-2019

231
kcr assembly budget
- Advertisement -

2019-20 సంవత్సారానికి రూ.1,82,017కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలకే కాకుండా కొత్త కార్యక్రమాలతో అందరి మన్ననలను పొందామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో లబ్దిపొందని కుటుంబం లేదన్నారు. తెలంగాణ వృద్ధిరేటు గణనీయంగా పెరిగిందన్నారు.2018-19లో తెలంగాణ వృద్ధిరేట 10.5 శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పారు.

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు అన్నిరంగాల్లో వెనుకబడి ఉందన్నారు. సమైక్యపాలనలో జరిగిన దుప్పరిణామాలు మనల్ని వెంటాడాయన్నారు. కరెంట్ కోతలతో అల్లాడమన్నారు.వలస కరువులు,వలస బ్రతుకులతో గుక్కెడునీటి కోసం అల్లాడమన్నారు.

తెలంగాణ పునర్‌ నిర్మాణం కోసం జరిగిన ప్రమాణంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని స్వల్పకాలంలోనే అధిగమించి చీకట్లను అధిగమించామన్నారు. బలహీనవర్గాలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇచ్చామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగామన్నారు. తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్‌గా మారిందన్నారు.

ఎన్నికల హామీలు,సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. వ్యవసాయం,సాగునీటి,విద్య,వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. పెన్షన్ల పెంపు,రైతుబంధు సాయం పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 33 జిల్లాలతో తెలంగాణ సుభీక్షంగా ఉందన్నారు.

- Advertisement -