గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన నటి తులసి..

236
Actress Tulasi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు జయప్రకాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో నటి తులసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని దీనిని నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. అందరూ కూడా బాధ్యత తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -