త్రిష 96 కు అవార్డుల పంట..!

920
Actress Trisha
- Advertisement -

కోలీవుడ్‌లో గత ఏడాది అక్టోబర్ 4న విడుదలైన ‘96’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష నాయకా నాయికలుగా నటించగా, సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, సమంతలు నాయకా నాయికలుగా నటిస్తున్నారు.

trisha 96

అయితే తమిళ ‘96’ సినిమా త్రిషకు అత్యధిక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి నిన్నటి ఫిల్మ్ ఫేర్ వరకు త్రిష మొత్తం 11 అవార్డులని ఈ సినిమాతో సొంతం చేసుకోవడం విశేషం. ఇన్ని పురస్కారాల్నిఇప్పటివరకు ఒకే చిత్రానికి ఏ నటీ సొంతం చేసుకోలేదు. దీంతో త్రిష ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఈ సినిమాపై త్రిష సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… జాను పాత్రకు ఇప్పటివరకు 11 అవార్డులు వచ్చాయంటూ అవార్డులతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నాకు వచ్చిన దీవెనలను లెక్కిస్తున్నా.. ‘96’కు 11 అవార్డులు, ‘హేజూడ్’(మలయాళం) సినిమాకు 3 అవార్డులు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు అని త్రిష ట్వీట్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

trisha

- Advertisement -