శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ సునైన ఇంటర్వ్యూ విశేషాలు…
-తెలుగులో ‘టెన్త్ క్లాస్’ తర్వాత చేస్తున్న సినిమా.
-తమిళంలో కాదలిల్ విలుందెన్ నా తొలి సినిమా. అక్కడ 20 సినిమాలు చేశాను.
-నేను తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. అయితే తెలుగులో ఎంట్రీని ఓ మంచి సినిమాతో ప్రారంభించాలని అనుకున్నాను. 2019లో విడుదలైన సిల్కువారి పట్టి సినిమాను చూసిన డైరెక్టర్ హసిత్ రాజరాజ చోర సినిమా కోసం నన్ను సంప్రదించాడు. కథ విన్నాను.. బాగా నచ్చింది. మంచి పెర్ఫామెన్స్ పాత్ర అనిపించడంతో సినిమాకు ఓకే అన్నాను. నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు భిన్నమైన పాత్ర.
-ఇందులో లాయర్ రోల్‌లో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం కాస్త ప్రిపేర్ అయ్యాను. హసిత్‌గారి సపోర్ట్‌తో లాయర్స్ కొంత మందిని దగ్గరగా గమనించాను. వాళ్లెంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతారో, ఎలా ఎటాక్ చేస్తారోనని అబ్జర్వ్ చేశాను.
-సినిమాకు సగం డబ్బింగ్ చెప్పాను. కానీ పాండమిక్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెన్నై నుంచి హైదరాబాద్ రాలేకపోయాను. మిగతా పార్ట్‌ను మరొకరు పూర్తి చేశారు.
-సినిమా ఓ కామెడీ థ్రిల్లర్. సిట్యువేషనల్ కామెడీ. కుటుంబం అంతా కలిసి చూసే సినిమా.
-శ్రీవిష్ణు చాలా సైలెంట్. చాలా సిగ్గరి. చాలా మంచి వ్యక్తి. ఫ్రెండ్లీగా ఉంటాడు. తక్కువగా మాట్లాడిన ఫన్నీగా మాట్లాడుతాడు.
-హసిత్ డైరెక్టర్‌గా మంచి టాలెంటెడ్. సినిమాలో సన్నివేశాన్ని ఎలా తీయాలనే దానిపై తనకు పక్కా క్లారిటీ ఉంటుంది. సెన్సిబుల్ డైరెక్టర్. కాన్ఫిడెన్స్ పర్సన్.
-నటిగా డిఫరెంట్ పాత్రలు చేయడానికే నేను ప్రాధాన్యమిస్తాను.