చీరకట్టుతో ఆకట్టుకునే స్నేహ పుట్టిన రోజు

694
- Advertisement -

పదేళ్ల పాటు పక్కింటమ్మాయి పాత్రలతో టాలీవుడ్-కోలీవుడ్ వెండితెరపై నవ్వుల పరిమళాలు వెదజల్లి దక్షిణాది ప్రేక్షకుల మనసులు దోచిన నటి స్నేహ. ఒకప్పటి సౌందర్యకు ప్రతిరూపంలా.. చక్కటి తెలుగుదనం ఉట్టిపడేలా నుదుటిపై బొట్టుతో, కాటుక కళ్లతో, చీరకట్టుతో ఆకట్టుకున్న స్నేహ… ‘మనసున ఉన్నదీ.. చెప్పాలనున్నదీ..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రియమైన నీకు, తొలివలపు, సంక్రాంతి, శ్రీరామదాసు, పాండురంగడు, రాజన్న తదితర చిత్రాల్లో నటించిన స్నేహ. నటించింది తక్కువ చిత్రాలైనా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ఆమె పుట్టినరోజు సందర్భంగా స్నేహకు పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

sneha-62d1ed72

స్నేహ అసలు పేరు ‘సుహాసిని. చిన్నప్పుడు బాగా నవ్వుతూ ఉండేదట స్నేహ అందుకే ఆమెకు ఆ పేరు పెట్టారట. సినిమాల్లోకి వచ్చాక ‘స్నేహ’గా మార్చుకున్నారు. ముంబైలో పుట్టి.. దుబాయిలో పెరిగి.. చివరకు తన మాతృభాషా తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది స్నేహ. స్నేహ దుబాయిలోనే ప్లస్‌ 2 వరకు చదువుకుంది. ఒకసారి స్నేహ దుబాయిలో ఒక స్టార్ నైట్ షోలో పాల్గోన్న మోహన్‌లాల్‌, మమ్ముట్టి, మీనాలాంటి సినీ తారల ఆటోగ్రాఫ్‌ల కోసం నిలబడి ఉన్నారట. ఇంతలో మలయాళ దర్శకుడు ఫాజిల్‌.. స్నేహను చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడిగారట. అప్పుడేం చెప్పాలో తెలియక తనకు తెలియదు అన్నారట. ఈ విషయం ఆమె ఇంట్లో చెబితే మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత అన్నీ ఆలోచించి సరేనన్నారు. దీంతో మొదటిసారిగా ఓ మలయాళ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ప్రేక్షకులూ ఆమెనెంతో ఆదరించారు.

maxresdefault

2001లో తరుణ్‌కు జోడీగా నటించిన ‘ప్రియమైన నీకు’ చిత్రంలో అమాయకత్వం, మంచితనం కలగలిపిన అమ్మాయి పాత్రలో స్నేహ చక్కగా నటించారు. నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రమిది. అదే ఏడాది గోపీచంద్‌తో కలిసి ‘తొలివలపు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తర్వాత ‘వెంకీ’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘రాధాగోపాలం’, ‘శ్రీ రామదాసు’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’, ‘మహారథి’, ‘మధుమాసం’, ‘పాండురంగడు’, ‘అమరావతి’, ‘రాజన్న’, ‘ఉలవచారు బిర్యాని’ తదితర చిత్రాల్లో నటించారు.

sneha1

2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ పెళ్లి చేసేసుకుని సినిమాల విషయంలో కొంచెం స్లో అయింది కానీ.. ఇప్పటికీ ఈమె ట్యాలెంట్ కి తగిన పాత్రలు వస్తూనే ఉన్నాయి.. వచ్చిన వాటిలో మంచి ఛాన్సులను వదులుకోకుండా చేస్తూనే ఉంది స్నేహ. ప్రస్తుతం స్నేహ… మమ్ముట్టితో ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రధానంగా అచ్చమైన పక్కింటి ఆడపడుచు లుక్ స్నేహకు పెద్ద అస్సెట్. దీనికి తోడు ఎలాంటి పాత్రనైనా మెప్పించగల ట్యాలెంట్ ఈమె సొంతం. అందుకే ఇప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని greattelangaana.com కోరుకుంటోంది.

- Advertisement -