శోభనకు పెళ్లి కావాలట..

365
Actress Shobana to Get Married?
- Advertisement -

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శోభన. ప్రస్తుతం ఈమె మనసు పెళ్లిపై మళ్లినట్లు తెలుస్తోంది. ఆమె వయస్సు దాదాపు 47 సంవత్సరాలు. అయితే అమె వివాహానికి దూరంగా ఉండటం గత కొద్దికాలంగా మిస్టరీగా మారింది. తన పెళ్లి గురించి మీడియా తెలుసుకొనేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించడానికి నిరాకరించేది. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Actress Shobana to Get Married?

శోభన పెళ్లి చాలా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఓ మలయాళ నటుడితో ఆమెకు ఉన్న ప్రేమ వ్యవహారమే అనేది అప్పట్లో బలంగా వినిపించింది. వారి ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారట. దాంతో మనస్తాపానికి గురైన శోభన వివాహానికి దూరంగా ఉన్నారనేది ఓ రూమర్. మరి శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవించింది. కానీ ఇప్పుడు తాను మంచి భాగస్వామిని ఎంచుకున్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

Actress Shobana to Get Married?

శోభన ఐదేళ్ల క్రితం ఒక బిడ్డను దత్తతు తీసుకోని ఓ భరతనాట్యం పాఠశాలను నిర్వహిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇంతకాలం పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ, ఇప్పుడు ఆమె మనసు పెళ్లిపై పడిందని వార్తలు వస్తుంది. అయితే ఈ న్యూస్ పై ఆమె ఇంకా స్పందిచలేదు.. పెళ్లిపై శోభన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు వార్తలు మాత్రం మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. శోభన ఏం చెబుతుందో చూడాలి మరి.

- Advertisement -