ఇలియానా ఇలా ఎంటీ..!

208
Baadshaho Poster: Ileana D'Cruz Is 'Bold, Beautiful And Badass'
Baadshaho Poster: Ileana D'Cruz Is 'Bold, Beautiful And Badass'
- Advertisement -

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో గోవాబ్యూటీ ఇలియానా తన అందాలను బాగానే ఆరబోసింది. ఇమేజ్ పెరిగేకొద్ది ఎక్స్ పోజింగ్ విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చింది. లిప్ లాక్, బోల్డ్ సీన్లలో నటించాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేసింది. ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడమే కాక మ్యాగజైన్ ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది. అయినా అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.

గతేడాది వచ్చిన రుస్తుం సినిమా తప్ప.. బాలీవుడ్‌లో ఇలియానాకు పెద్దగా ఒరిగిందేమిలేదు. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్ హీరోగా బాద్షాహో సినమాలో ఇలియానా నటిస్తోంది. ఇటీవల అజయ్ దేవగణ్‌ లుక్‌ను బయటపెట్టిన బాద్షాహో టీం… లేటెస్ట్‌గా ఇలియానా లుక్‌ని కూడా భయటపెట్టింది. ఈ లుక్‌లో ఇలియానా పెద్దగా ఆకర్షణీయంగా లేదు. ఈ మూవీలో ఇల్లీ బేబీ డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అసలే అమ్మడి గ్లామర్ ఈ మధ్య కాలంలో దెబ్బ తిన్నది. దీనికి తోడు ఇలాంటి పద్ధతైన క్యారెక్టర్లు వేయడం మొదలుపెడితే ఇలియానా కెరీర్‌ కష్టమే. మరి ఫస్ట్ లుక్‌లో ఉన్నట్లే సినిమాలోనూ ఉంటుందా.. లేక డిఫరెంట్‌గా ఏమైనా కనిపిస్తుందా అన్నది చూడాలి.

1497686275-1318

భారీ బడ్జెట్‌తో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ఇలియానా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంకిత్ తివారీ, సందీప్ శిరోద్కర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 1న ‘బాద్షాహో’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -