గ్రీన్ ఛాలెంజ్ ..మొక్కలు నాటిన శైలజ

129
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతున్నారు.

తెలుగు ప్రజలు చూపిన చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం లాంటి కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతుందని అన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటి శైలజ మొక్కలు నాటి తన వంతు ప్రకృతికి కాపాడుతానని ప్రతిజ్ఙ చేసింది.

ఈ సందర్భంగా నటి శైలజ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మనమందరం వీలైనంత వరకు మన ఇంటి చుట్టు పక్క గానీ వీలు ఉన్న చోటులో మొక్కలు నాటితే మనకే కాకుండా భావితరాలకు మంచి చేసినవారిమి అవుతామన్నారు.

మొక్కలను నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

టీజర్…మీట్ క్యూట్

మొక్కలు నాటిన వసుధ మూవీ టీం..

గ్రీన్ ఛాలెంజ్‌లో డా.మార్కండేయులు

- Advertisement -