డ్రగ్స్ కేసులో నటి సంజనకు బెయిల్..

376
sanjana
- Advertisement -

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన సంజన గల్రానీకి బెయిల్ లభించింది. సంజనకు బెయిల్ ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. వీరిద్దరూ పలుమార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా నిరాశే మిగిలింది. అయితే, తాజాగా సంజన బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు సానుకూలంగా స్పందించింది. సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షలకు వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తులు సంజనకు ష్యూరిటీ ఇవ్వాలని, హైకోర్టు ఆదేశించింది.

అంతేగాకుండా, నెలలో రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరవ్వాలని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మాదకద్రవ్యాల కేసులో సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్కొంది. కాగా, ఆరోగ్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్టు హైకోర్టు వెల్లడించింది. కాగా, సంజన శనివారం ఉదయం లోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాగిణితో పాటు సంజనా గర్లానీ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంది.

మరోవైపు సంజ‌నా రెండేళ్ల క్రితం ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించింది. ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్ ఇపుడు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అయింది. బెంగళూరులోని దారుల్ ఉలుమ్ షా వలిఉల్లామ్ మజీదు ద్వారా ఇస్లాం స్వీకరించినట్టు ఓ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్లామ్‌లోకి మారిన తర్వాత సంజనా తన పేరును మహిరాగా మార్చుకున్నట్టు ఆ సర్టిఫికేట్‌లో ఉంది. అయితే సంజ‌నా ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన విష‌యంపై పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ, డ్రగ్స్ రాకెట్‌లో అరెస్టు తర్వాత ఆమె నిశ్చితార్థం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

- Advertisement -