ప్రముఖ టెలివిజన్ నటి ‘కుంకుమ భాగ్య’లో దియా టాండన్ పాత్ర ద్వారా సంచిత ఉగాలే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ టీవీ సీరియల్స్ ‘కుంకుమ భాగ్య’, ‘వాగ్లే కీ దునియా’ లలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టెలివిజన్ నటి సంచిత ఉగాలే (22) ఆదివారం (జూన్ 14) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.
ఈ ఘటన జూన్ 14న నలసోపరా ఈస్ట్‌లోని ఆచోలే గ్రామంలో ఉన్న సాయి సంతోషి బిల్డింగ్‌లోని ఆమె నివాసంలో చోటుచేసుకుంది. అచోలే పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాగ్ మాట్లాడుతూ.. సంచిత ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల మధ్య తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపలి నుండి గడియ పెట్టుకుందని, ఆపై చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
కుటుంబ సభ్యులు, స్థానిక నివాసితులు వెంటనే ఆమెను వసాయ్-విరార్ మున్సిపల్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన విచారణ ప్రక్రియను ప్రారంభించారు. మృతదేహానికి ఇన్‌క్వెస్ట్ నివేదికను సిద్ధం చేసి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆమె తండ్రి మచ్చింద్ర ఉగాలే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అచోలే పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:టీఎంసీ రెబల్స్…NCPIలో విలీనం!

