సమీరా రెడ్డి…తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రాజమండ్రిలో పుట్టిన ఈ తెలుగమ్మాయి నరసింహుడు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది.తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ,ఎన్టీఆర్‌తో అశోక్ సినిమాల్లో నటించి మెప్పించింది. చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించిన సమీరా బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది.
2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటూ అప్డేట్స్ అందిస్తోంది సమీరా. ప్రస్తుతం ఐదు నెలల గర్బవతినని తెలిపిన సమీరా తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
అంతేగాదు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడుతోన్న ఫొటోను సమీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికీ తన స్విమ్ సూట్ బాగా ఫిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. సమీరా రెండో బిడ్డకు జూలైలో జన్మనిచ్చే అవకాశం ఉంది. సమీరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.