బాలయ్య చేసింది…ఫ్రెండ్లీ ఫైట్‌ అట!

457
balakrishna vasundara
- Advertisement -

ఇప్టివరకు తన నోటి దురుసుతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఈసారి ఫ్యాన్‌ని తరిమికొడుతూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌ని తలపించేలా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నడిరోడ్డుపై ఓ అభిమానిని వెంటాడి వేటాడి తరిమికొట్టారు. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు పరిగెత్తాడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో బాలయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా నెటిజన్లు బాలయ్యను ఏకీపారేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించారు బాలయ్య సతీమణి వసుంధర. తన శ్రీవారిని వెనకేసుకొచ్చిన ఆమె మా ఆయన ఎప్పుడూ అంతే.. తన అభిమానులతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తేలిగ్గా తీసిపారేశారు.

ఫ్యాన్స్ శృతిమించి వ్యవహరించినా.. తప్పుగా ప్రవర్తించినా ఆయనకు వెంటనే కోపం వచ్చేస్తుందని చెప్పారు. క్రమశిక్షణతో లేకపోతే ఆవేశం ఆపుకోలేరని, ఆయన తిట్టేది, కొట్టేది అభిమానులు, కార్యకర్తలపై ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు. బాలయ్య తిట్టినా,కొట్టినా ఫ్యాన్స్‌ ఏమీ అనుకోరని ..మా ఆయనంటే పడనివాళ్లు మాత్రమే ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. తన భర్త కాబట్టి బాలయ్యను వసుంధర వెనకెసుకొస్తున్న తెలుగు తమ్ముళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు.

- Advertisement -