టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత-నాగ చైతన్యల లవ్ స్టోరీ గురించి తెలియనివారుండరు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరు.. త్వరలోనే పెళ్లికి కూడా సిద్దమవుతున్నారు. ఇక నాగ్-సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఒకరికొకరు సహకరించుకుంటూ.. టాలీవుడ్‌లో ఆదర్శ జంటగా నిలుస్తున్నారు. నాగ చైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం.. మే 26న విడుదలవుతుండగా..ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. చాలా కలర్ ఫుల్ గా, ఇంప్రెసివ్ గా ఉన్న ట్రైలర్ చివరలో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ చైతూతో ఓ డైలాగ్ చెప్పించారు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇది సమంతని ఉద్దేశించే అన్నాడా అని అభిమానులు ఆలోచనలు చేశారు. కొందరైతే డైరెక్ట్ గా సమంతని ట్విట్టర్ లో ప్రశ్నించారు కూడా. దీనికి సమంత చిలిపిగా సమాధానం ఇచ్చింది. చైతూ అంది నా గురించి కాదు .. మిగతా అమ్మాయిల గురించి అని చెప్పి అందరి ఆలోచనలకు ఓ చిన్న బ్రేక్ వేసింది సమంత.
కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలకు అద్దం పట్టే కొన్ని సన్నివేశాలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. దాదాపు ముఖ్యమైన తారాగణాన్ని కవర్ చేస్తూ .. కలర్ ఫుల్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సంభాషణలు కూడా సహజత్వానికి దగ్గరగా .. ఆకట్టుకునేలా వున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో నాగార్జున కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో చైతూకి కూడా ఆ స్థాయి హిట్ ఇస్తాడేమో చూడాలి.