సమంత ప్రత్యేక పూజలు.. అందుకే?

13
- Advertisement -

సమంత ఇటీవలి కాలంలో నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా తాజాగా తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఈరోజు ఉదయం సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకో తెలుసా ?, తను అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలని ఎంతో ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్యస్వామికి ప్రార్థనలు చేసింది. మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తోంది.

‘ఖుషి’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ లో సమంత ప్రస్తుతం పాల్గొంటుంది. ఖుషి సినిమా షూటింగ్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా సాగుతుందని దర్శకుడు శివ నిర్వాణ ఇటీవలే తన పోస్ట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ కోసం సమంత బల్క్ డేట్స్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి.

ఆ తరహాలోనే విజయ్ దేవరకొండ – సమంత చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ. ఐతే, విజయ్ తో సమంత కెమిస్ట్రీ ఎలా సాగుతుందో చూడాలి. పైగా ఈ సినిమాలో సమంత – విజయ్ దేవరకొండ పై లిప్ కిస్ లు కూడా ఉన్నాయట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -