సూపర్ హిట్ మూవీ ‘జయం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా.. ఇప్పుడు హిట్ల కోసం తెగ తిప్పలు పడుతోంది. ‘జయం’, ‘అపరిచితుడు’ లో నటించిన సదా అప్పట్లో ఆడియెన్స్‌ని ఆకర్షించింది.
కానీ..రాను రాను సదా చేసిన సినిమాలన్నీ..ప్లాప్ అవడంతో అప్సెట్ అయిన సదా…బుల్లి తెరపై జడ్జిగా రంగ ప్రవేశం చేసింది.
అయితే ఆమెలో హీరోయిన్ గా నటించాలనే కోరిక మాత్రం ఇంకా ఉంది.. దీంతో ఒక వైపు గ్లామర్ షో చేస్తూ నిర్మాత, దర్శకులను లైన్ లో పెట్టే పనిలో పడింది. పనిలో పనిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదిస్తే…. పేరు మార్చుకోమన్నాడట. దీంతో ఆమె పేరును మార్చేసుకుంది.
ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్ గా మారినట్టు తెలిపింది. సదా అసలు పేరు సదాఫ్ మహ్మద్ సయిద్.. జయం సినిమాలో ఆమెకు స్ర్కీన్ నేమ్ గా సదా అని వేశారు. ఇప్పటి వరకూ అదే కొనసాగింది.
ఇప్పడు ఆమెకు 33 ఏళ్లు..ఈ వయసులో పేరు మార్చుకుని తన అదృష్టాన్ని పరిక్షీంచుకోవాలనుకుంటున్న ఈ అమ్మడుకి ఈ కొత్తపేరుతో అయినా.. కొత్త కొత్తగా కనిపిస్తూ.. మురిపిస్తుందో లేదా చూడాలి మరి.