మొక్కలు నాటిన ప్రముఖ నటి నందితా శ్వేత..

55
Actress Nandita Swetha

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన తెలుగు, కన్నడ, తమిళ సినిమాల హీరోయిన్ నందితా శ్వేత నేడు గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఈఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

ఈ రోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.