రెండో పెళ్లి వార్తల పై  నగ్మా సీరియస్  

54
- Advertisement -
నిన్నటి తరం అందాల భామ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రధాన పాత్రలు పోషించి ఆకట్టుకుంది నగ్మా. ఇదిలా ఉంటే తాజాగా నగ్మా పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె లేటు వయసులో పెళ్లి చేసుకోవడానికి ఆశ పడుతుంది అని ఓ తమిళ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్ చేశాడు. కొంతమంది తమిళ సీనియర్ జర్నలిస్టులు, అనుభవశాలి అన్న అర్హతతో నటీనటులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. తెలుగులో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.  
 
ఐతే, తన వ్యక్తిగత విషయాల గురించి చిన్న చూపు చేసి మాట్లాడే వారి పై  నగ్మా చాలా సీరియస్ అయ్యింది. నేరుగా ఆ తమిళ జర్నలిస్ట్ కి ఫోన్ చేసి.. మహిళలంటే నీకు  ఎంత చిన్నచూపు ?,  నేను ఈ  విషయాన్ని సీరియస్ గా తీసుకుని  కేసు పెడితే,  ఏమిటి నీ పరిస్థితి ? అని చాలా ఘాటుగానే ఆన్సర్ ఇచ్చిందట. అసలు ఇంతకీ, ఆ తమిళ సీనియర్ జర్నలిస్ట్ ఏం మాట్లాడాడు అంటే.. ‘ఈ జనరేషన్ చాలా తెలివైనది.  వయసు అయిపోయిన హీరోయిన్లు ఏమీ చేసినా  ఇక వారిని ఈ జనరేషన్ పెద్దగా పట్టించుకోదు ?,  అందుకే, నగ్మాకి పెళ్లి పై  మనసు మల్లింది అంటూ సదరు తమిళ జర్నలిస్టు మాట్లాడాడు.
 
ఈ సందర్భంగా నగ్మా అతనికి ఫోన్ చేసి కడిగి పారేసింది. నగ్మా ఎప్పటికీ నగ్మానే అని.. తాను ఇప్పుడు కూడా బోల్డ్ రోల్స్ లో కనిపించడానికి సిద్ధంగా ఉన్నాను అని, తాను నటిస్తే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు అని నగ్మా చెప్పుకొచ్చింది. పైగా తాను గతంలో హీరోయిన్ గా సాధించిన విజయాలను గుర్తు చేసింది. ఎన్నో రకాల యాడ్స్ చేయడం, సినిమాలు చేయడం, రాజకీయాల్లో పాల్గొనడం  ఇలా ఎన్నో రంగాల్లో మహిళగా తను సాధించిన విజయాల గురించి నగ్మా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా నగ్మా బాగా ఫీల్ అయిన్నట్టు ఉంది. అందుకే,  ఆమె ఇలా ఎమోషనల్ అయ్యింది అంటున్నారు.  
 
- Advertisement -