‘మీనా’కి అలాంటి వ్యక్తి కావాలట

51
- Advertisement -

సీనియర్ హీరోయిన్ మీనా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. భర్త విద్యాసాగర్ మరణం ఆమెను చాలా బాధ పెట్టింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుంచి బయట పడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండో పెళ్లి చేసుకోమని ఆమె బంధువులు ఒత్తిడి చేస్తున్నారట. కానీ, మీనా మాత్రం తన కూతురు నైనికా గురించి ఆలోచిస్తోంది. తాను తన సుఖాన్ని చూసుకుంటే.. తన కూతురు నైనికా ఇబ్బంది పడుతుందని.. కాబట్టి, మళ్లీ పెళ్లి వద్దు అని ఆమె ఇన్నాళ్లు చెబుతూ వస్తోంది. అయితే, తాజాగా మీనా తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తన కుటుంబ సభ్యులకు మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, సరైన సంబంధం వస్తేనే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పిందట. నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యి ఉండాలని.. అలాంటి వ్యక్తి కోసం నేను ఎదురుచూస్తున్నాను అని, అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని మీనా క్లారిటీ ఇచ్చిందట. అయితే, మీనా ఏమైనా పదహారేళ్ల పడుచు పిల్ల కాదు కదా. పైగా ఓ పిల్లకు తల్లి కూడా. పైగా హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అయిపోయింది.

అలాంటి మాజీ బ్యూటీ కోసం, ఎందుకు సాలిడ్ బిజినెస్ మ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారని మీనా స్నేహితులే కామెంట్స్ చేస్తున్నారట. నిజానికి బబ్లీ బ్యూటీగా మీనాకి నేటికీ ఫుల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే గతంలో ఈ ముదురు భామ తెలుగు తమిళ్ భాషల్లో కొన్నాళ్ళు పాటు ఒక వెలుగు వెలిగింది. ఐతే, ఫామ్ లో ఉన్న సమయంలోనే మీనా సరిగ్గా తనకు కావాల్సిన లైఫ్ పార్టనర్ ను ఎన్నుకోలేకపోయింది. కానీ, తన రెండో వివాహంలో మాత్రం మీనా మితిమీరిన కోరికలు కోరుతూ ఉండటం కొసమెరుపు. చూద్దాం మీనా రెండో పెళ్లి మజిలీ ఎంత దూరం వెళ్తుందో.

Also Read:లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -